వైఎస్ వివేకా హత్య కేసులో బీటెక్ రవి.. శివశంకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని సీబీఐ వైఎస్ఆర్ కడప జిల్లాకు తరలించారు. పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని హాజరుపరిచారు. ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి […]

Update: 2021-11-18 06:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని సీబీఐ వైఎస్ఆర్ కడప జిల్లాకు తరలించారు. పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని హాజరుపరిచారు.

ఇదిలా ఉంటే వైఎస్ వివేకా హత్య కేసులో తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి తనయుడు దేవిరెడ్డి చైతన్యరెడ్డి తెలిపారు. తమకు న్యాయం చేయాలని సీబీఐను కోరాడు. ‘కేవలం ఆరోపణతోనే మా తండ్రిని అరెస్టు చేశారు. ఈనెల 15న మా తండ్రి ఎడమ భుజానికి సర్జరీ జరిగింది. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నందున న్యాయంచేయాలని సీబీఐకి విజ్ఞప్తి చేస్తున్నట్లు’ దేవిరెడ్డి చైతన్యరెడ్డి విజ్ఞప్తి చేశాడు.

సీబీఐకు శివశంకర్‌రెడ్డి లేఖ

ఇదిలా ఉంటే సీబీఐకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖను శివశంకర్‌రెడ్డి తనయుడు చైతన్యరెడ్డి మీడియాకు విడుదల చేశాడు. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని శివశంకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నాడు. వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. వైఎస్ వివేకా హత్యకు మూలకారణం, హత్య చేసిందెవరో సునీతకు తెలుసని లేఖలో పేర్కొన్నాడు. వైఎస్ వివేకా తనయ సునీత, భర్త రాజశేఖర్‌రెడ్డి, మరిది శివప్రకాష్‌రెడ్డి, వివేకా భార్య సౌభాగ్యమ్మను సీబీఐ విచారించాలన్నారు.

పదేపదే సునీత సీబీఐ అధికారులను ఎందుకు కలుస్తున్నారో విచారించాలని డిమాండ్ చేశారు. అలాగే హత్య జరిగిన తర్వాత వైఎస్ వివేకా కాల్ డేటాను డిలీట్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి సంబంధముందని లేఖలో ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి.. వైఎస్ వివేకాపై గెలిచారని.. తనకు రాజకీయంగా అడ్డుగా ఉండకూడదనే వివేకా హత్యకు కుట్ర చేసి ఉండొచ్చని సంచలన ఆరోపణలు చేశారు. బీటెక్ రవిని కస్టడీలోకి తీసుకోని విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని శివశంకర్ రెడ్డి లేఖలో పేర్కొన్నాడు.

‘హమ్మర్’ కారు నడిపిన US ప్రెసిడెంట్ ‘జో బైడెన్’.. ఆయన ఫన్నీ కామెంట్స్ మీకోసం..!

Tags:    

Similar News