Human Rights Commission: ఆ ఆస్పత్రి నిర్వాకంపై కేసు నమోదు.. సుమోటోగా స్వీకరించిన హెచ్ఆర్‌సీ

దిశ, కరీంనగర్ సిటీ : కరోనా చికిత్స కోసం వస్తే రోగి చనిపోయినా, డబ్బులు ఇవ్వాలంటూ రోగి బంధువులను వేధించిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుల నిర్వాకంపై, విచారణ జరపాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కలెక్టర్‌ను ఆదేశించింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పలు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వార్తలు రాగా, స్పందించిన హెచ్ఆర్‌సీ కేసును సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. కరోనా చికిత్స పేరుతో రోగుల భయాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా […]

Update: 2021-05-24 08:05 GMT

దిశ, కరీంనగర్ సిటీ : కరోనా చికిత్స కోసం వస్తే రోగి చనిపోయినా, డబ్బులు ఇవ్వాలంటూ రోగి బంధువులను వేధించిన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుల నిర్వాకంపై, విచారణ జరపాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కలెక్టర్‌ను ఆదేశించింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై పలు ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వార్తలు రాగా, స్పందించిన హెచ్ఆర్‌సీ కేసును సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. కరోనా చికిత్స పేరుతో రోగుల భయాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకుని, జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో డబ్బులు లాగుతున్నా, అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై నోటీసులు జారీ చేసింది.

ఆసుపత్రి లో చేర్చుకునేందుకు లక్ష రూపాయలు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారని, మందుల బిల్లులు కాకుండా ప్రతిరోజు ఇతర కారణాల సాకుతో, వేలాది రూపాయలు వసూలు చేశారని పేషెంట్ అటెండెన్స్ ఆరోపిస్తున్నారని, డబ్బులు చెల్లించడంలో జాప్యం కలిగితే కనీస మానవత్వం లేకుండా రోగులను డిశ్చార్జి చేస్తూ ఆ స్థానంలో మరో రోగికి బెడ్ కేటాయిస్తున్నారని, ఫలితంగా రోగులు మరణిస్తుండగా, నిత్యం పర్యవేక్షణ చేయటం లేదని స్పష్టమవుతుందంటూ, బిల్లులు చెల్లించనిదే రోగుల తరపు బంధువులకు మృతదేహాలు అప్పగించడం లేదనే ఆరోపణలకు తోడు, మరో ఆస్పత్రిలో రోగికి పెట్టిన వెంటిలేటర్ పని చేయడంలేదని పేషెంట్ అటెండెంట్ చెప్పేవరకు ఆస్పత్రి సిబ్బంది చూడలేదని, మరుసటిరోజే రోగి మరణించగా పూర్తి బిల్లు చెల్లించాలంటూ నిర్వాహకులు రోగి బంధువులపై ఒత్తిడి చేశారని ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ కు పంపిన నోటీసులో పేర్కొంది. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విచారణ జరిపి, వాస్తవ నివేదిక ఈనెల 29న అందజేయాలంటూ, మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

Tags:    

Similar News