Reliance Scholarship Result: రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..!
దేశవ్యాప్తంగా యువతను ఉన్నత విద్య(Education) వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్(Reliance foundation) 2022లో అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా యువతను ఉన్నత విద్య(Education) వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రిలయన్స్ ఫౌండేషన్(Reliance foundation) 2022లో అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఫౌండర్ ధీరుబాయి అంబానీ(Dhirubhai Ambani) 90వ జయంతి సందర్భంగా నీతా అంబానీ(Nita Ambani) ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. దీని ద్వారా పదేళ్లలో 50,000 మందికి స్కాలర్‌షిప్‌లు(Scholarships) అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన ప్రతీ విద్యార్థికి రూ. 2 లక్షల వరకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. 2022 నుంచి ఇప్పటివరకు మొత్తం 28,000 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించారు. డిగ్రీ(Degree), పీజీ(PG) ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌లు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఇదిలా ఉంటే.. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లకు చెందిన ఫలితాలను(Results) రిలయన్స్ ఫౌండేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా లక్ష మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 5000 మంది అండర్ గ్రాడ్యుయేట్లు విద్యార్థులు ఎంపికైనట్లు ఫౌండేషన్ ప్రకటించింది. అయితే.. ఈ స్కాలర్‌షిప్ ఎంపికలో తెలుగు విద్యార్థులు సత్తా చాటడం విశేషం. మొత్తం 1261 శాతం మంది తెలుగు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. ఇందులో ఏపీ(AP) నుంచి 850 విద్యార్థులు ఉండగా.. తెలంగాణ(TG) నుంచి 411 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ స్కాలర్‌షిప్ కు అప్లై చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://scholarships.reliancefoundation.org/ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.