Job Calender 2025:ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్.. ప్రభుత్వం కీలక ప్రకటన

నూతన సంవత్సరం(New Year)లో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-01 11:27 GMT

దిశ,వెబ్‌డెస్క్: నూతన సంవత్సరం(New Year)లో నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్(Job Calender) విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల(జనవరి) 12వ తేదీన 866 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు, పాత నోటిఫికేషన్ల రాత పరీక్ష వివరాలు APPSC ప్రకటించే అవకాశం ఉంది. ఒక్క ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లోనే 800కు పైగా పోస్టులున్నట్లు తెలుస్తోంది. అత్యధికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు 650కి పైగా ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం.

త్వరలో పూర్తి కానున్న ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా ఈ నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉంటే.. పాత నోటిఫికేషన్ల పై ప్రభుత్వం(AP Government) కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో నవంబర్ 2023 లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్ పరీక్షలు 2025 ఏప్రిల్ తర్వాత నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2025 ఫిబ్రవరి 23న గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లకు రాతపరీక్షలను 2025 జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.

 

Tags:    

Similar News