Ys Jagan: తల్లికి వందనంపై ఇంతటి బరితెగింపా..?
తల్లికి వందనంపై ఇంతటి బరితెగింపా..? అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: ప్రజలకు చంద్రబాబు(Chandrababu) ఇచ్చిన హామీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) విమర్శలు కురిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ఇంతటి బరి తెగింపా అంటూ ట్వీట్ చేశారు. తల్లికి వందన(Thalliki Vandanam) డబ్బులను వచ్చే ఏడాది నుంచి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పుడేమో ఏడాది తర్వాత అంటున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఇంతటి తేలిక తనమా? అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? అని నిలదీశారు. లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఎన్నికల వేళ మీరు, మీ కూటమి నాయకులు రాష్ట్రంలోని ప్రతిచోటా తల్లికి వందనంపై చేసిన ప్రచారం అంతా ఇంతాకాదు. ఇంటింటికీ తిరిగి కనిపించిన ప్రతి పిల్లాడినీ పట్టుకుని నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు, నీకు రూ.15వేలు అన్నారు. ఇద్దరుంటే రూ.30వేలు ఇస్తామన్నారు, ముగ్గురు ఉంటే రూ.45వేలు ఇస్తామన్నారు. నలుగురు ఉంటే రూ.60వేలు ఇస్తామన్నారు. ప్రజలకు మీరుచేసిన వాగ్దానం, మీరు చెప్పిన మాటలు ఆడియో, వీడియోల రూపంలో సాక్ష్యాధారాలుగా ప్రతిఒక్కరి సెల్‌ఫోన్‌లో ఉన్నాయి. వైయస్సార్‌సీపీ హయాంలో 44.48 లక్షల మంది తల్లులకు, దాదాపు 84 లక్షల మంది పిల్లలకు, రూ.26,067 కోట్లను మేము అందించి, అత్యంత విజయవంతంగా అమలుచేసిన అమ్మ ఒడిని ఆపేసినా, మీరు ఇస్తామన్న పథకం వస్తుందేమోనని బడికి వెళ్లే ఆ పిల్లలు, వారి తల్లులు ఈ 7-8నెలలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. చివరకు వారి ఆశలపై నీళ్లు జల్లి, ఈ ఏడాది ఇవ్వమని నిస్సిగ్గుగా చెప్తున్నారు. ప్రజలకు ఒక మాట ఇచ్చి, దాన్ని నమ్మించి, వారి ద్వారా అధికారాన్ని తీసుకుని, ఇప్పుడు ఇవ్వలేమంటూ ఎలాంటి సంకోచంలేకుండా చెప్తున్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది.’’ అని చంద్రబాబుపై వైఎస్ జగన్ విమర్శలు చేశారు.
1.@ncbn గారూ… ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింపా? మేనిఫెస్టోపై ఇంతటి తేలిక తనమా? ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా?
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 4, 2025
2.అధికారంలోకి వస్తే తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు…