Leopard : శ్రీశైలం పూజారి ఇంట్లో ప్రత్యక్షమైన చిరుత

శ్రీశైలం దేవస్థానం(Srisailam Temple) పరిసర అడవుల్లో తరుచు సంచరించే చిరుత పులు(Leopards)లు ఈ ధఫా ఏకంగా దేవస్థానం పూజారి ఇంట్లో(Priest's House)నే ప్రత్యక్షమైన ఘటన వైరల్ గా మారింది.

Update: 2025-01-06 06:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : శ్రీశైలం దేవస్థానం(Srisailam Temple) పరిసర అడవుల్లో తరుచు సంచరించే చిరుత పులు(Leopards)లు ఈ ధఫా ఏకంగా దేవస్థానం పూజారి ఇంట్లో(Priest's House)నే ప్రత్యక్షమైన ఘటన వైరల్ గా మారింది. పాతాళగంగ మెట్ల మార్గంలో నివసిస్తున్న శ్రీశైలం దేవస్థానం పూజారి సత్యనారాయణ ఇంట్లోకి అర్థరాత్రి చిరుత ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్ లో చిరుత సంచారం చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. చిరుత ఇంట్లోకి వచ్చిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

జనావాసాల్లోకి చిరుత వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మళ్లీ చిరుత ఎప్పుడు వస్తుందోనని కలవరపడుతున్నారు. చిరుత సంచారంతో అటవీశాఖ అధికారులు అలర్టయ్యారు. చిరుత కదలికలపై ఆరా తీస్తూ దాని జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News