Kuppam: అప్పులకుప్పగా రాష్ట్రం... సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు..
దిశ, వెబ్ డెస్క్: అప్పుల కుప్పగా రాష్ట్రం మారిందని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) అన్నారు. కుప్పం ద్రవిడ యూనివర్సిటీ(Kuppam Dravida University)లో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్(Swarna Kuppam Vision 2029 Document)ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 2014-19 తన హయాంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. జగన్(Jagan) హయాంలో 4 శాతం అభివృద్ధి తగ్గిపోయిందని తెలిపారు. గత ఐదేళ్లలో జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మండిపడ్డారు. తన నియోజకవర్గం అని కుప్పంపై కక్ష సాధింపునకు దిగారని వ్యాఖ్యానించారు. కుప్పంలో టీడీపీ(Tdp) నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. కానీ తాము మాత్రం రాబోయే రోజుల్లో కుప్పాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కష్టపడకుండా అభివృద్ధి జరగదన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కుప్పంలో మరో పార్టీకి గెలుపులేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.