Home Minister Anitha: హోంమంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు.. విధుల నుంచి తొలగింపు
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమె ప్రైవేటు వ్యక్తిగత సహాయకుడు (PA) సంధు జగదీశ్‌ను విధుల నుంచి తొలగించారు. అయితే, గత పదేళ్లుగా అనిత వద్దే విధులు నిర్వర్తిస్తున్న జగదీశ్‌పై అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లు, అవినీతి ఆరోపణలకు పాల్పడుతున్నారంటూ ఎప్పటి నుంచే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లవెత్తాయి. ఇటీవల హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత పోలీసుల బదిలీలు, పోస్టింగ్స్ కోసం సిఫార్సు చేసేందుకు గాను పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారంటూ జగదీష్‌పై అటు కూటమి ప్రభుత్వానికి ఇటు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అప్రమత్తమైన హోమంత్రి అనిత తాజాగా జగదీశ్‌ను విధుల నుంచి తొలగించారు.