Nellore: ఆట స్థల విషయంలో ఫైటింగ్.. యువకుడు దారుణ హత్య

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది..

Update: 2025-01-06 08:34 GMT

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా(Nellore District) లో దారుణం జరిగింది. ఉదయగిరి మండలం కొండాయిపాలెం(Kondayipalem)లో యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. చర్చి సమీపంలోని ఆట స్థలం(Play Ground) విషయంలో ఇరు వర్గాల(Two Groups) మధ్య ఘర్షణ(Fighting) చెలరేగింది. తమ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారని ఓ వర్గం రెచ్చిపోయింది. బూతులు తిడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, రాళ్తు, కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో యువకుడు అభిషేక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొదుతూ అభిషేక్ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యువకుడు అభిషేక్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Tags:    

Similar News