‘దిశ’ క్యాలెండర్ ఆవిష్కరించిన సినీ నటుడు
నూతన సంవత్సరం 2025 క్యాలెండర్‌ను సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ వేటపాలెంలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు.
దిశ,చీరాల: నూతన సంవత్సరం 2025 క్యాలెండర్‌ను సోమవారం ఉదయం ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ వేటపాలెంలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. దిశ నెట్ వర్క్ ఇంచార్జ్ చీరాల కాశీ విశ్వనాథ్ అజయ్ ఘోష్ కు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. దిశ జిల్లా క్యాలెండర్ లో జిల్లా ప్రతిష్టను పాఠకులకు తెలియజేసే విధంగా వివిధ పరిశ్రమలు, ఓడరేవులు, చారిత్రాత్మక ప్రదేశాలు పొందుపరచడం అభినందనీయమన్నారు. ఆవిష్కరణ కార్యక్రమంలో అజయ్ ఘోష్ తో పాటు అతని సోదరుడు మల్లిక్, దిశ బాపట్ల జిల్లా ప్రతినిధి ఎన్.నాగార్జున రెడ్డి, దిశ చీరాల నియోజకవర్గం ఇంచార్జ్ చుక్కా సాంబశివరావు పాల్గొన్నారు.