CBSE Recruitment: సూపరిండెంట్ ఉద్యోగాలకు సీబీఎస్ఈ నోటిఫికేషన్ విడుదల
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ(Ministry of Education) ఆద్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ(Ministry of Education) ఆద్వర్యంలోని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 212 పోస్టులను భర్తీ చేయనున్నారు. సూపరిండెంట్(Superintendent), జూనియర్ అసిస్టెంట్(Junior Assistant) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 2న ప్రారంభం కానుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 జనవరి 2025. సూపరిండెంట్ పోస్టులు 142, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 70 ఉన్నాయి. ఎస్సీ -30, ఎస్టీ- 19, ఓబీసీ- 72, ఈడబ్ల్యూఎస్- 27, అన్ రిజర్వడ్- 64 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, వయోపరిమితి, ఎగ్జామ్ ఫీజు, పే స్కేల్, పరీక్ష విధానం, సెలెక్షన్ ప్రాసెస్ వంటి వివరాలకు అభ్యర్థులు వెబ్‌సైట్ ను సంప్రదించగలరు.