Kotha Madhumurthy: ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు స్వీకరణ

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(AP Higher Education) చైర్మన్‌గా ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి(Kotha Madhumurthy) బాధ్యతలు చేపట్టారు.

Update: 2024-12-30 13:29 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(AP Higher Education) ఛైర్మన్‌గా ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి(Kotha Madhumurthy) బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు మంగళగిరిలోని(Mangalagiri) మండలి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వరంగల్(Warangal)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(NIT)లో మెకానికల్ ఇంజినీరింగ్ సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. కాగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సుల్లర్(VC) నియామకాలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, ఉన్నత విద్యలో తక్షణమే తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో ఆయన చర్చించారు. గుంటూరు(Guntur) జిల్లా తెనాలి(Tenali) మండలం జాగర్లమూడి(Jagarlamudi) మధుమూర్తి స్వగ్రామం. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బీటెక్(B.tech), నిట్ లో ఎంటెక్(M.tech), పీఎచ్డీ(PHD) పూర్తి చేశారు.

Tags:    

Similar News