రెవెన్యూ సదస్సులకు 1,80,000 అర్జీలు:మంత్రి అనగాని సత్యప్రసాద్

కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.

Update: 2025-01-02 11:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు, 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు అందాయని మంత్రి వెల్లడించారు. ఈరోజు ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులతో త్వరగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వ పాపాల కారణంగా ఏపీలో భూ సంబంధ సమస్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.

రెవెన్యూ సదస్సులకు వస్తున్న అర్జీలే ఇందుకు తార్కాణమని అన్నారు. ఇప్పటి వరకు లక్ష 80 వేల అర్జీలు వచ్చాయని తెలిపారు. 13 వేల ఫిర్యాదులకు అక్కడిక్కడే పరిష్కరించామని అన్నారు. కూటమి ప్రభుత్వం పై నమ్మకంతో రెవెన్యూ సదస్సులకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారని చెప్పారు. ఇప్పటి వరకు 6 లక్షల మంది రెవెన్యూ సదస్సులకు హాజరయ్యారని తెలిపారు. ఆర్ ఓ ఆర్‌లో తప్పులపై లక్షకుపైగా ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. భూమి సరిహద్దు సమస్యలపై 18 వేలకు పైగా అర్జీలు వచ్చాయన్నారు. రీసర్వే సమస్యల పై 11 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అసైన్డ్ ఇళ్ల స్థలాలపై ఆరు వేలకు పైగా ఫిర్యాదులు, 22 ఏ భూముల అక్రమాలపై 4,500 ఫిర్యాదులు అందాయని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.


Similar News