UCO Bank: స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి యూకో బ్యాంకు నోటిఫికేషన్ విడుదల

కోల్‌కతా(Kolkata)లోని యూకో బ్యాంక్(UCO Bank) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

Update: 2024-12-30 14:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోల్‌కతా(Kolkata)లోని యూకో బ్యాంక్(UCO Bank) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 68 స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ucobank.com/job-opportunities ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 20 జనవరి 2025.

పోస్టులు, ఖాళీలు:

స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) - 68

విద్యార్హత:

పోస్టును బట్టి సీఏ, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అలాగే పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

రాత పరీక్ష, అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.600 ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీ వారికి రూ. 100 ఫీజు ఉంటుంది.

వయోపరిమితి:

1 నవంబర్ 2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 48,170 నుంచి రూ. 93,960 వరకు జీతం ఉండనుంది.


Read More..

RBI: భారత ఆర్థిక వ్యవస్థ చేతిలో మెరుగైన అవకాశాలు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా  

Tags:    

Similar News