Medical Seats : మెడికల్ సీట్లు ఖాళీగా ఉంచొద్దు : సుప్రీంకోర్ట్ ఆదేశాలు
వైద్య విద్యకు సంబంధించిన సీట్ల(Medical Seats)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్ : వైద్య విద్యకు సంబంధించిన సీట్ల(Medical Seats)పై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉండటానికి వీల్లేదని కేంద్రానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో వెయ్యికి పైగా సీట్లు ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ వైపు వైద్యుల కొరత ఉండటం, మరోవైపు ఇలా వైద్య సీట్లు భర్తీ కాకపోవడంపై అసహనం తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలతో సహ ఇతర భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా దీనిపై కేంద్రం ఓ కమిటిని ఏర్పాటు చేయగా.. ఈ అంశంపై కమిటీకి మూడు నెలల సమయం ఇస్తూ.. అప్పటిలోగా వైద్య సీట్లు మిగిలిపోకుండా తీసుకోవాల్సిన విధానాలను సూచించాలని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ లో చేపడతామని ఈ సందర్భంగా సుప్రీంకోర్ట్ తెలియ జేసింది.