CSIR-UGC NET : సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ అప్లికేషన్ గడువు పొడగింపు..!
దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో సైన్స్(Science) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) అర్హత కోసం నిర్వహించే సీఎస్ఐఆర్- యూజీసీ నెట్(CSIR-UGC NET) నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో సైన్స్(Science) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్(Assistant Professor), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF) అర్హత కోసం నిర్వహించే సీఎస్ఐఆర్- యూజీసీ నెట్(CSIR-UGC NET) నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి దరఖాస్తు గడవు నేటితో ముగియనుంది. తాజాగా అప్లికేషన్ గడువును మరో రెండు రోజులు పొడగిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మంగళవారం ప్రకటించింది. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://csirnet.nta.ac.in/ ద్వారా జనవరి 2వ తేదిలోగా అప్లై చేసుకోవాలని తెలిపింది. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు దేశవ్యాప్తంగా 225 నగరాల్లో రెండు సెషన్లలో ఈ ఎగ్జామ్స్(Exams)ను నిర్వహించనున్నారు. సెషన్-1 పరీక్షలు ఉదయం 9.00-12.00 వరకు, సెషన్-2 పరీక్షలు మధ్యాహ్నం 2.00-5.00 గంటల వరకు కండక్ట్ చేస్తారు. తెలంగాణాలో హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.