వరంగల్ లో కార్డెన్ సెర్చ్
దిశ, కాళోజీ జంక్షన్: హన్మకొండ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమంగా అమ్ముతున్న మద్యం, ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులతోపాటు గ్యాస్ సిలిండర్లు, అనుమతి లేని దీపావళి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూసీ, హన్మకొండ, సుబేదారి, మహిళా పోలీస్ స్టేషన్ల సీఐలు, 15 మంది […]
దిశ, కాళోజీ జంక్షన్: హన్మకొండ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్బన్ సెర్చ్ నిర్వహించారు. అక్రమంగా అమ్ముతున్న మద్యం, ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తులతోపాటు గ్యాస్ సిలిండర్లు, అనుమతి లేని దీపావళి బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ పుష్పారెడ్డి మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి అదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి, కేయూసీ, హన్మకొండ, సుబేదారి, మహిళా పోలీస్ స్టేషన్ల సీఐలు, 15 మంది ఎస్సైలు,72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి కేయూసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటిపల్లి, జవహర్ నగర్ కాలనీలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా విక్రయిస్తున్న గుట్కా ప్యాకెట్లు, టపాసులు, పెట్రోల్, డీజల్, 2 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్రమత్తం చేశారు.