వీసా రీవాలిడేషన్ ప్రక్రియలో భారత టెకీలకు అమెరికా శుభవార్త!
హెచ్1బీ వీసాలు కలిగిన భారతీయులకు అమెరికా శుభవార్త అందించింది. అమెరికాలోని కొన్ని విభాగాల్లో డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలు కలిగిన భారతీయులకు అమెరికా శుభవార్త అందించింది. అమెరికాలోని కొన్ని విభాగాల్లో డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్ ప్రక్రియను త్వరలో పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఈ ఏడాది చివరి నాటికి పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే గనక అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ టెకీలతో పాటు పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన టెకీలకు ప్రయోజనాలు కలగనున్నాయి.
2004 వరకు కొన్ని విభాగాలకు చెందిన నాన్-ఇమిగ్రేషన్ వీసాలకు, ప్రధానంగా హెచ్1బీ వీసాలు అమెరికాలోనే వ్యాలిడేషన్ ఇచ్చేవారు. ఆ తర్వాత నిబంధనల్లో మార్పులు జరిగాయి. దానివల్ల వీసాలను పునరుద్ధరణ చేసుకునేందుకు టెకీలు సొంత దేశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీన్ని తాజాగా సవరిస్తూ ప్రస్తుత ఏడాది చివరికి వీసాల రీవ్యాలిడేషన్ ప్రక్రియను అమెరికాలోనే చూసుకునేలా చర్యలు తీసుకోనున్నారు. ఇది ప్రస్తుత అమెరికా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టేందుకు నిర్ణయించింది.