Suzuki Access 125: సుజుకీ యాక్సెస్ 125 సరికొత్త రికార్డు.. ఇప్పటివరకు 60 లక్షల స్కూటర్లు ఉత్పత్తి..!

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా(SMCI) వెహికల్స్ కు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

Update: 2024-12-29 12:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా(SMCI) వెహికల్స్ కు దేశీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఆకర్షణీయమైన డిజైన్(Design), ఫీచర్ల(Features)తో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ద్విచక్ర వాహన ప్రియులు వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. తన పాపులర్ స్కూటర్లలో ఒకటైన సుజుకీ యాక్సెస్ 125(Suzuki Access 125) 60 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైలురాయిని సాధించింది. ఈ స్కూటర్ 2006 సంవత్సరంలో భారత మార్కెట్లో(Indian Market) లాంచ్ అయింది. అప్పటి నుంచి దీనికి సంబంధించి 60 లక్షల యూనిట్లు ఉత్పత్తి(Produce) చేయబడ్డాయి. సుజుకీ కంపెనీకి చెందిన వెహికల్స్ లో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్ కూడా ఇదే. ఇక గత నెల నవంబర్ లో 54,118 యూనిట్లు సేల్ అయ్యాయి. 2023లో ఇదే సమయంలో 52,512 యూనిట్లతో పోలిస్తే ఈ సారి 3.06 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. కాగా భారత మార్కెట్ లో సుజుకీ యాక్సెస్ 125 ప్రారంభ ధర రూ. 84,281గా ఉంది. 


Similar News