Air India: విమాన ప్రయాణీకులకు ఎయిర్ఇండియా గుడ్ న్యూస్..!

టాటా గ్రూప్(Tata Group)కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా(Air India) విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2025-01-01 12:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాటా గ్రూప్(Tata Group)కు చెందిన దిగ్గజ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా(Air India) విమాన ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి జాతీయ(National), అంతర్జాతీయ(International) విమానాల్లో వైఫై(Wifi) సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది. ఈ మేరకు సంస్థ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9తో పాటు.. ఎంపిక చేసిన విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సర్వీసులు లభిస్తాయని పేర్కొంది. దేశంలో వైఫై సేవలు ప్రవేశపెట్టిన మొదటి ఎయిర్ లైన్స్(Airlines) తమదేనని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

కాగా ఎయిర్ఇండియా ప్రస్తుతం న్యూయార్క్(NewYork), సింగపూర్(Singapur), లండన్(London) వంటి నగరాలకు నడిపే ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9 విమానాల్లో మాత్రమే వైఫై సేవలు అందిస్తోంది. ఇకపై దేశీయంగా ట్రావెల్ చేసే ఫ్లైట్స్ లోనూ ఈ సేవలు ప్రారంభించినట్లు పేర్కొంది. విమానం 10 వేల అడుగుల హైట్ కు చేరుకున్నాక వైఫై ఆన్ అవుతుందని.. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్ టాప్ వంటి డివైజుల్లో సేవలను పొందొచ్చని తెలిపింది. తొలుత కొన్ని విమానాల్లోనే ఈ సేవలు పొందొచ్చని, త్వరలోనే మరిన్ని ఫ్లైట్స్ లో అందుబాటులోకి తీసుకొస్తామని ఎయిర్ఇండియా వెల్లడించింది.


Tags:    

Similar News