GST Collections: డిసెంబరులో రూ. 1.77 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు..!

దేశీయ వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Update: 2025-01-01 11:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా దేశీయ లావాదేవీల(Domestic Transactions) రాబడి పెరగడంతో గత డిసెంబర్ నెలలో రూ.1. 77 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7.3 శాతం పెరిగినట్లు బుధవారం ఆర్థికశాఖ(Department of Finance) గణాంకాలు వెల్లడించాయి. మొత్తం వసూలల్లో సెంట్రల్ జీఎస్టీ(CGST) రూ. 32,836 కోట్లు, స్టేట్ జీఎస్టీ(SGST)టీ రూ. 40,499 కోట్లుగా ఉన్నాయని, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ(IGST) కింద రూ. 91,200 కోట్లు, సెస్(SES)ల రూపంలో రూ. 12,300 కోట్లు సమకూరాయని గణాంకాలు తెలిపాయి. ఇక సమీక్షించిన నెలలో దేశీయ లావాదేవీలతో వచ్చిన జీఎస్టీ 8.4 శాతం పెరిగి రూ. 1. 32 లక్షల కోట్లకు చేరుకోగా.. దిగుమతులపై విధించిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 4 శాతం వృద్ధితో రూ. 44,268 కోట్లుగా నమోదైందని ఆర్థిక శాఖ డేటా పేర్కొంది. వరుసగా పదో నెల జీఎస్టీ వసూళ్లు 1. 7 లక్షల కోట్లకు పైగా నమోదయ్యాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో రికార్డు స్థాయిలో రూ. 2.10 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News