SBI: రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించిన ఎస్‌బీఐ

హర్ ఘర్ లఖ్‌పతి, ఎస్‌బీఐ ప్యాట్రాన్స్ పేర్లతో వీటిని ప్రారంభించింది.

Update: 2025-01-03 18:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్ల కోసం రెండు కొత్త డిపాజిట్ పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హర్ ఘర్ లఖ్‌పతి, ఎస్‌బీఐ ప్యాట్రాన్స్ పేర్లతో వీటిని ప్రారంభించింది. దీనికి సంబంధించి శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, హర్ ఘర్ లఖ్‌పతి స్కీమ్‌లో రూ. లక్ష లేదా ఆపైన రూ. లక్ష చొప్పున పొదుపు చేసేందుకు వీలుని కల్పిస్తుంది. ప్రీ క్యాలుకులేటెడ్ రికరింగ్ డిపాజిట్ అయిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడుతుందని ఎస్‌బీఐ వివరించింది. మైనర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇక, ఎస్‌బీఐ ప్యాట్రన్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్‌ల కోసం తీసుకొచ్చిన ప్రత్యేక డిపాజిట్ పథకం. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారికి అధిక వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తోంది. కొన్నేళ్లుగా మదుపు చేసేందుకు ఇష్టపడుతున్న కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. వినియోగదారుల ఇష్టాలను పరిగణించే కొత్త డిపాజిట్ పథకాలను తీసుకొచ్చామని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News