Cement Industry: సిమెంట్‌పై జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలి: జేకే లక్ష్మీ సిమెంట్
బడ్జెట్‌లో దీనికి సంబంధించి విధానపరమైన చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రెసిడెంట్, డైరెక్టర్ అరుణ్ శుక్లా చెప్పారు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కీలక నిర్మాణ రంగంలో సామగ్రి వినియోగం పెంచేందుకు ప్రభుత్వం సిమెంట్‌పై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని జేకే లక్ష్మీ సిమెంట్ తెలిపింది. వచ్చే నెల ప్రవేశపెట్టబోయే 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో దీనికి సంబంధించి విధానపరమైన చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రెసిడెంట్, డైరెక్టర్ అరుణ్ శుక్లా చెప్పారు. దేశీయంగా నిర్మాణాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సిమెంట్ తయారీ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది, ఇది సగటున 7-8 శాతం వార్షిక రేటుతో పెరుగుతుందని ఆయన తెలిపారు. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అరుణ్ శుక్లా.. సిమెంట్‌పై జీఎస్టీని తగ్గించాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. భారత ఆర్థికవ్యవస్థకు తోడ్పడే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు సిమెంట్ అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సిమెంట్ వినియోగాన్ని పెంచాలని, అందుకోసం దీనిపై విధిస్తున్న అత్యధిక జీఎస్టీ నుంచి 18 శాతానికి పరిమితం చేయడం అవస్రామని అరుణ్ శుక్లా వివరించారు. సిమెంట్ కాంక్రీట్ రోడ్లు ఎక్కువ కాలం మన్నిక ఉంటాయి. భవిహ్స్యత్తులో ఇవి తారు రోడ్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవిగా మారనున్నాయని ఆయన తెలిపారు. కాబట్టి పాలసీ విధానాల్లో మార్పులు చేసి సిమెంట్ వినియోగాన్ని పెంచే చర్యలు తీసుకోవలని పేర్కొన్నారు.