Stock Market: తొలిరోజూ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..!

దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) న్యూ ఇయర్ తొలి సెషన్ ను లాభాలతో స్టార్ట్ చేశాయి.

Update: 2025-01-01 11:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ స్టాక్ మార్కెట్లు(Stock Market) న్యూ ఇయర్ తొలి సెషన్ ను లాభాలతో స్టార్ట్ చేశాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ పరిస్థితులు ఉండటంతో ఈ రోజు(బుధవారం) సూచీలు ఫ్లాట్ గా ప్రారంభం కాగా.. మధ్యాహ్నం వరకు పుంజుకున్నాయి. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకింగ్(Banking), ఐటీ(IT), ఎఫ్ఎంసీజి(FMCG) షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బెంచ్ మార్క్ సూచీలు రాణించాయి. సెన్సెక్స్(Sensex) ఉదయం 78,265.07 పాయింట్ల వద్ద లాభాలతో స్టార్ట్ అయ్యింది. ఇంట్రాడేలో 78,756 వద్ద గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 368.40 పాయింట్ల లబ్ధితో 78,507.41 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ(Nifty) కూడా 98.10 పాయింట్లు పెరిగి 23,742.80 వద్ద స్థిరపడింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. అమెరికన్ డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.64 వద్ద ముగిసింది.

లాభాల్లో ముగిసిన షేర్లు: టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎల్&టీ, మారుతీ సుజుకీ

నష్టాల్లో ముగిసిన షేర్లు: అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, జొమాటో, HCL టెక్నాలజీస్


Tags:    

Similar News