TGB: టీజీబీ-ఏపీజీవీబీ విలీనం.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన బ్యాంక్..!
కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం-ఒకే బ్యాంక్(One State-One Bank) నినాదం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(APGV) బ్రాంచులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో ఇటీవలే విలీనమైన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం తెచ్చిన ఒకే రాష్ట్రం-ఒకే బ్యాంక్(One State-One Bank) నినాదం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(APGV) బ్రాంచులు తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో ఇటీవలే విలీనమైన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి విలీన నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోనే టీజీబీ అతిపెద్ద రూరల్ బ్యాంకుల్లో(Rural Banks) ఒకటిగా అవతరించింది. ఈ నేపథ్యంలో ఏపీజీవీబీ అకౌంట్(Account) ఉన్న తెలంగాణకు చెందిన కస్టమర్లకు(Customers) టీజీబీ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
- ఏపీజీవీబీ మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ప్లే స్టోర్ నుంచి టీజీబీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- నెట్ బ్యాంకింగ్ వినియోగదారులు https://tgbhyd.in/ అనే వెబ్‌సైట్ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు.
- ఏపీజీవీబీ ఏటీఎం కార్డులను ఛేంజ్ చేసుకోవడానికి అకౌంట్ ఉన్న బ్రాంచును సంప్రదించాల్సి ఉంటుంది.
- ఏపీజీవీబీ చెక్ బుక్ ఉన్న అకౌంట్ హోల్డర్లకు న్యూ చెక్ బుక్ లను ఇదివరకే వారి అడ్రస్ కు పంపించినట్లు టీజీబీ వెల్లడించింది.
- పాత చెక్ బుక్స్ ను యూజ్ చేయొద్దని,ఒకవేళ ఓల్డ్ చెక్ బుక్ ఉంటే బ్రాంచుల్లో తిరిగి ఇచ్చేయాలని బ్యాంక్ పేర్కొంది.
- రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ వ్యవస్థ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ట్రాన్సక్షన్స్ కోసం యూజ్ చేసే IFSC కోడ్ ఇకపై SBIN0RRDCGB ను వినియోగించాలని తెలిపింది.
- వాట్సాప్ బ్యాంకింగ్& మిస్ కాల్ అలర్ట్ సర్వీసెస్ కోసం 9278031313 అనే నంబర్ ను సంప్రదించాలని టీజీబీ సూచించింది.