సింగిల్ చార్జింగ్ తో 500 కిలోమీటర్ల మైలేజ్..మార్కెట్లోకి కొత్త కార్లు!
మార్కెట్లోకి రకరకాల కార్లు వస్తున్నాయి. జనాలు ఈ మధ్యకాలంలో కార్ల విపరీతంగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. కొత్త కార్లు

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి రకరకాల కార్లు వస్తున్నాయి. జనాలు ఈ మధ్యకాలంలో కార్ల విపరీతంగా కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో.. కొత్త కార్లు కూడా రావడం మనం చూస్తున్నాం. పెట్రోల్ ( Petrol ) అలాగే డీజిల్ ( Diesel) ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలకు ( electric vehicles) కూడా మొగ్గు చూపిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్లలో.. కొత్త కొత్త మోడల్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే... 500 కిలోమీటర్లు మైలేజ్ ఇచ్చే కార్లు కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే...
మారుతి సుజుకి ఈ విటారా ( Maruti Suzuki E Vitara )
మారుతి కంపెనీ నుంచి వచ్చిన ప్రతి కారు మార్కెట్లో బాగా పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మన ఇండియన్స్ మారుతి కంపెనీని నమ్ముకుని ఉన్నారు. అయితే ఈ కంపెనీ నుంచి "ఈ విటారా" పేరుతో మరో కొత్త మోడల్ కారు రాబోతుంది. ఈ కారులో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఒకసారి ఫుల్ చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజ్ ( Milege) ఇస్తుందని.. కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఈ కారు ఈ ఏడాది చివరిలోపు వస్తుందట. త్వరలోనే ధర పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని కంపెనీ ప్రకటన చేసింది.
టాటా హారియర్ EV ( Tata Harrier EV)
మన ఇండియాలో టాటా కంపెనీని మించిన మరో కంపెనీ లేదని చెప్పవచ్చు. టాటా అంటేనే బ్రాండ్. ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి కారు 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. అయితే ఈ కారు నుంచి త్వరలోనే సరికొత్త ఎలక్ట్రానిక్ కార్ రాబోతుంది. హరియర్ EV లో కొత్త మోడల్ తీసుకురాబోతున్నారు. ఇందులో 75కే డబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ అందిస్తున్నారట. ఇక ఈ కారు ఒకసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు.