Highest Salary: ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న వ్యక్తి ఇతనే.. రోజుకు 48 కోట్లు..!

ప్రపంచంలో ఎక్కువ జీతం(Highest Salary) తీసుకునే వ్యక్తి ఎవరనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

Update: 2025-01-01 15:28 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచంలో ఎక్కువ జీతం(Highest Salary) తీసుకునే వ్యక్తి ఎవరనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. కాగా 'అన్ స్టాప్(Unstop)' అనే సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ వేతనం పొందుతున్నది భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. 'క్వాంటం స్కేప్(Quantum Scape)' ఫౌండర్, సీఈవో జగదీప్ సింగ్(Jagdeep Singh) వరల్డ్ లోనే అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. కంపెనీ సీఈవోగా ఆయన వార్షిక జీతం రూ. 17,500 కోట్లుగా ఉంది. అంటే నెలకు రూ. 1,458 కోట్లు కాగా.. ఒక రోజుకు రూ. 48 కోట్ల శాలరీ అందుకుంటున్నారు. కాగా క్వాంటం స్కేప్ కంపెనీ ఎలెక్ట్రిక్ కార్లలో(EV Cars) వాడే లిథియమ్(Lithium) మెటల్ బ్యాటరీలపై పరిశోధన చేస్తుంది. జగదీప్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ(Stanford University) నుంచి బీటెక్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం(University of California) నుంచి ఎంబీఏ పట్టా పొందారు. క్వాంటం స్కేప్ కంపెనీని ఏర్పాటు చేయకముందు ఆయన వివిధ కంపెనీల్లో కీలక పదవుల్లో పని చేశారు.

Tags:    

Similar News