Personal Loan తీసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే ?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం చాలా మంది ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇక కరోనా మహమ్మారి ప్రభావంతో పని లేక చేతిలో రూపాయి లేక ఇబ్బందులు ఎదుర్కొన్నవారున్నారు. ఏదైనా అత్యవసరం వస్తే కనీసం అప్పు ఇచ్చే వారు కూడా లేకపోవడంతో ప్రజలు పర్సనల్ లోన్స్ వైపు మొగ్గు చూపారు. విత్ ఔట్ డాక్యుమెంటేషన్ కావడంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, లోన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోకుండా, పర్సనల్ లోన్ తీసుకుని సమస్యల వలయంలో చిక్కుకున్నారు.
ఖాతాదారుని బ్యాంకు స్టేట్ మెంట్ ఆధారంగా,తన ట్రాన్సెక్షన్స్, బట్టి లక్ష నుంచి 10 లక్షల వరకు కూడా కొన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలు అందిస్తున్నాయి. అయితే ఇలాంటి రుణాలు సమయానికి, సమస్యల నుంచి తప్పించినా తర్వాత ఇబ్బందుల్లో పడక తప్పదు అంటున్నారు కొందరు. అయితే ఇలా వ్యక్తిగత రుణాలు తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంట. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రుణగ్రస్థుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. ప్రతి నెలా వాయిదాకు సరిపడ డబ్బులు మన అకౌంట్‌లో ఉండేలా చూసుకోవాలి.
2. రుణ గ్రస్థుడు తప్పని సరిగా .. తను తీసుకున్న రుణానికి పాలసీ చేయించుకోవాలి ఎందకంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగినట్లైతే కుటుంబం మీద రుణభఆరం పడకుండా ఉంటుంది.
3. రుణం తీసుకుని ప్రతి నెల సరైన తేదికి, చెల్లించాలి. అలా వీలు కానీ సమయంలో మీ ఆర్థఇక సమస్య గురి పూర్తి సమాచారం బ్యాంకు ముందుగానే తెలియజేయాలి. దీని వలన ఒత్తిడి తగ్గే అవకాశం ఉ:ది.
4.ఆర్‌బీఐ గుర్తింపు పొందిన సంస్థల నుంచే రుణం తీసుకోవడం శ్రేయస్కరం.
5. రుణం చెల్లించే ముందు, చెల్లించిన తర్వాత మీ అకౌంట్‌ను పరిశీలించుకోవడం మంచిది.