Gold Discounts: ఎనిమిది నెలల్లోనే అత్యధికంగా బంగారంపై డిస్కౌంట్లు ఇస్తున్న వ్యాపారులు

మార్కెట్లో డిమాండ్ క్షీణతను దృష్టిలో ఉంచుకుని బంగారం వ్యాపారులు ఎన్నడూ లేనంత డిస్కౌంట్లను కస్టమర్లకు ఇస్తున్నాయి

Update: 2025-03-21 15:00 GMT
Gold Discounts: ఎనిమిది నెలల్లోనే అత్యధికంగా బంగారంపై డిస్కౌంట్లు ఇస్తున్న వ్యాపారులు
  • whatsapp icon

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు ప్రతి వారం కొత్త రికార్డు స్థాయిలకు చేరుకుంటోంది. ఇప్పటికే సామాన్యులు పసిడి కొనలేకపోతున్నామని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు కూడా గణనీయంగా పడిపోయాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ క్షీణతను దృష్టిలో ఉంచుకుని బంగారం వ్యాపారులు ఎన్నడూ లేనంత డిస్కౌంట్లను కస్టమర్లకు ఇస్తున్నాయి. బులియన్ డీలర్ల ప్రకారం, కస్టమర్లను ఆకర్షించేందుకు గడిచిన ఎనిమిది నెలల కాలంలోనే అత్యధిక డిస్కౌంట్లతో జ్యువెలరీ వ్యాపారులు బంగారం అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ధరల కంటే వ్యాపారులు ఒక్కో తులంపై రూ. 1,000 నుంచి రూ. 1,200 వరకు తగ్గింపు ఇస్తున్నాయి. గతవారం ఇచ్చిన డిస్కౌంట్ కంటే ఈసారి మరో రూ. 200-300 వరకు పెంచారు. ప్రస్తుతం దేశ రాజధానిలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 90,370 ఉంది. హైదరాబాద్‌లో రూ. 90,220 ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 82,700 వద్ద ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు 15 శాతానికి పైగా పెరిగాయి. పసిడి ధరలు ప్రతి వారం కొత్త గరిష్ఠాలకు చేరుకుంటోంది. చాలామంది ధరలు తగ్గుతాయని ఎదురుచూస్తున్నారని బులియన్ డీలర్లు చెబుతున్నారు. డిమాండ్ లేకపోవడంతోనే ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగారం దిగుమతులు 20 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. ఈ కారణంగా వ్యాపారులు బంగారంపై ఇంకా ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. 

Tags:    

Similar News