Penny Stock: పెన్నీ స్టాక్ మ్యాజిక్.. రూ. 25 నుంచి రూ. 1300కి ధర.. లక్షకు రూ. 50లక్షలొచ్చాయ్

Multibagger: మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ మ్యాజిక్ చేసింది. రూ. 25 నుంచి ఏకంగా రూ. 1300కి చేరింది.

Update: 2025-03-22 08:05 GMT
Penny Stock: పెన్నీ స్టాక్ మ్యాజిక్.. రూ. 25 నుంచి రూ. 1300కి ధర.. లక్షకు రూ. 50లక్షలొచ్చాయ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: Multibagger: మల్టీ బ్యాగర్ పెన్నీ స్టాక్ మ్యాజిక్ చేసింది. రూ. 25 నుంచి ఏకంగా రూ. 1300కి చేరింది. అది కూడా కేవలం కేవలం ఐదేళ్లలోనే ఇవ్వడం గమనార్హం. లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 50లక్షలు చేసింది. అదే జెన్ టాక్నాజీస్ కంపెనీ షేరు. ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతీయ స్టాక్ మార్కెట్లో చాలా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఎన్నో ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడిదారుల సంపదను గణనీయంగా పెంచుతాయి. అలాంటి మల్టీ బ్యాగర్స్ స్టాక్స్ లో ఒకటిగా నిలిచింది. అదే జెన్ టెక్నాలజీస్ స్టాక్. ఈ మల్టీ బ్యాగర్ కంపెనీ జెన్ టెక్నాలజీస్ కొన్ని సంవత్సరాల్లోనే తన పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించింది. గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ దాదాపు 5000శాతం రాబడిని ఇచ్చాయి. గత ఐదేళ్లలో జెన్ టెక్నాలజీస్ స్టాక్ రూ. 25 నుంచి రూ. 1300 దాటింది. మార్కెట్లో క రెక్షన్ సమయంలో ఇది భారీగా క్షీణించినప్పటికీ ఇప్పుడు మంచి వ్రుద్ధిని చూపుతోంది. జెన్ టెక్నాలజీస్ భారతదేశంలో ఎంట్రీ డోన్ సిస్టమ్స్, సిమ్యులేషన్ ట్రైనింగ్ పరికరాలకు ప్రముఖ సరఫరదారుగా ఉంది. శుక్రవానం నాడు కంపెనీ షేర్లు 5శాతం ఎక్కువ పెరిగి రూ. 1359.40కి చేరుకున్నాయి. కంపెనీ షేర్లు 52వారాల గరిష్ట స్థాయి రూ. 2627.52 వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఒక్కో షేరుకు రూ. 873గా పేర్కొంది.

జెన్ టెక్నాలజీస్ లిమిటెడ్ షేర్లు మార్చి 27, 2020న రూ. 25.30 వద్ద ఉన్నాయి. మార్చి 21, 2025న మల్టీబ్యాగర్ కంపెనీ షేర్లు రూ.1,359.40కి పెరిగాయి. ఈ కాలంలో కంపెనీ షేర్లు 5000 శాతానికి పైగా పెరిగాయి. ఈ కంపెనీ షేర్లలో ఎవరైనా మార్చి 27, 2020న రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, ఇప్పటివరకు ఆ పెట్టుబడిని కొనసాగిస్తే, ప్రస్తుతం రూ.1 లక్షకు కొనుగోలు చేసిన షేర్ల విలువ రూ.53 లక్షలు అయ్యేది.

గత నాలుగు సంవత్సరాలలో జెన్ టెక్నాలజీస్ షేర్లు 1430 శాతం రాబడిని ఇచ్చాయి . ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమతో అనుబంధించిన ఈ కంపెనీ షేర్లు మార్చి 19, 2021న రూ. 85.10 వద్ద ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష రూపాయలను 15 లక్షల 30 వేలుగా మార్చింది. గత మూడు సంవత్సరాలలో జెన్ టెక్నాలజీస్ షేర్లు 550 శాతం పెరిగాయి. రెండేళ్ల గురించి మాట్లాడుకుంటే, ఈ స్టాక్ 450 శాతం రాబడిని ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఇది 45 శాతం పెరిగింది. గత ఆరు నెలల చార్ట్‌ను పరిశీలిస్తే, ఈ స్టాక్ దాదాపు 25 శాతం పడిపోయింది. ఇది దాని ఆల్ టైమ్ హై రూ.2,627 నుండి రూ.1,360కి పడిపోయింది. గత ఆరు నెలల్లో పెట్టుబడిదారులు లక్షకు రూ.25,000 కోల్పోయేవారు. 

Tags:    

Similar News