పాన్ కార్డులో పేరు తప్పుగా ఉందా.. అయితే ఇంట్లోనే ఉండి ఇలా మార్చుకోండి!

భారతదేశ పౌరులకు అతి ముఖ్యమైన కార్డులలో పాన్ కార్డు ఒకటి. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయిన పాన్ కార్డు లేకుండా చేయడం కుదరదు.

Update: 2024-06-29 09:35 GMT

దిశ, ఫీచర్స్: భారతదేశ పౌరులకు అతి ముఖ్యమైన కార్డులలో పాన్ కార్డు ఒకటి. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయిన పాన్ కార్డు లేకుండా చేయడం కుదరదు. పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పది అంకెల విశిష్ట ఆల్ఫాన్యూమరిక్ నెంబర్. దీని ద్వారా ఆర్థిక పరమైన లావా దేవీలు జరుగుతాయి. మనం చేసే ప్రతి లావాదేవి వివరాలు పాన్ కార్డు ద్వారా ఆదాయపు పన్ను శాఖకు చేరుతుంది. దీనిలో ఒక్కసారి పేరు నమోదైతే ఆ ఖాతా సంఖ్య (PAN) శాశ్వతంగా ఉంటుంది. దీనిలో డేటా ఎప్పటికీ మారదు. కానీ కొన్ని సార్లు ఏదైనా అత్యవసర మార్పులు ఉన్నప్పుడు మాత్రం రిక్వెస్ట్ ద్వారా పాన్ డేటాలో మార్పు చేసుకోవచ్చు. పాన్ నెంబర్ ఎప్పటికీ మారదు కానీ దానిలో పేరు తప్పుగా పడ్డప్పుడు మార్పుల కోసం ఇప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని మీ పాన్‌ కార్డులో పేరు మార్చుకోవచ్చు. ఇందుకోసం ఫాలో కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌ ఇప్పుడు మనం తెలుసుకుందాం..

* ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం కరెక్షన్‌ అండ్‌ అప్లికేషన్‌ టైప్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ కేటగిరినీ సెలక్ట్‌ చేసకొని మొత్తం సమాచారాన్ని అందించాలి.

* ఇందులో భాగంగా మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, పాన్‌ కార్డ్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి.

* ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన సబ్‌మిట్ బటన్‌పై నొక్కాలి. వెంటనే కేవీసీ కోసం ఫిజికల్‌ లేదా డిజిటల్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. డిజిటల్ సెలక్ట్ చేసుకుంటే ఆధార్‌ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయొచ్చు.

* పాన్‌కార్డ్‌ ఈకేవైసీ కోసం ఆధార్ సెలక్ట్ చేసుకున్న తర్వాత మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. తర్వాత మీరు వివరాలను మార్చిన పాన్‌ కార్డ్‌ను ఎలా పొందాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవాలి.

* తర్వాత ఆధార్ కార్డులోని చివరి నాలుగు నంబర్లను ఎంటర్‌ చేయాలి. చివరిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది.

* చెల్లింపు పూర్తయిన తర్వాత కంటిన్యూపై నొక్కాలి. వెంటనే ఆధార్‌తో లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. సదరు ఓటీపీని ఎంటర్‌ చేసి క్లిక్‌ చేస్తే ప్రక్రియ ముగుస్తుంది. నెలరోజుల్లోపూ మీ పాన్‌ కార్డ్‌ మీ అడ్రస్‌కు వస్తుంది.

Similar News