Amazon: అమెజాన్ కీలక నిర్ణయం.. క్విక్ కామర్స్ రంగంలో ఎంట్రీకి రెడీ..!
భారతదేశంలోని నగరాల్లో క్విక్ కామర్స్(Quick Commerce) బిజినెస్ కు రోజురోజుకూ ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలోని నగరాల్లో క్విక్ కామర్స్(Quick Commerce) బిజినెస్ కు రోజురోజుకూ ఆదరణ భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రంగంలో బ్లింకిట్(Blinkit), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్(Swiggy Instamart), జెప్టో(Zepto) వంటి సంస్థలు సేవలు అందిస్తుండగా.. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) కూడా క్విక్ కామర్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఇయర్ ఎండ్(Year End) సమయంలో లేదా 2025 జనవరిలో క్విక్ కామర్స్ సర్వీసులను లాంచ్(Launch) చేసే అవకాశముందని పలు గ్లోబల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 9,10 తేదీల్లో 'సంభవ్(Sambhav)' పేరుతో నిర్వహించే వార్షిక సమావేశంలో(Annual Meeting) దీనిపై ఓ క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. కాగా క్విక్ కామర్స్ లోకి ప్రవేశం కోసం ఇప్పటికే స్పెషల్ రిక్రూట్మెంట్ సైతం అమెజాన్ చేపట్టినట్లు సమాచారం. మరోవైపు మన దేశంలో క్విక్ కామర్స్ సంస్థల జోరు కారణంగా లోకల్ కిరాణా షాప్స్(Grocery shops) మూతపడే ప్రమాదముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.