Nishant Pitti: ‘ఈజ్ మై ట్రిప్’ సీఈవో నిశాంత్ పిట్టి రాజీనామా..
ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ (EaseMyTrip) ప్లానర్స్ ప్రమోటర్, సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి (Nishanth Pitti) తన సీఈవో (CEO) పదవికి ఇవాళ రాజీనామా చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ ట్రావెల్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ (EaseMyTrip) ప్లానర్స్ ప్రమోటర్, సహ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి (Nishanth Pitti) తన సీఈవో (CEO) పదవికి ఇవాళ రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో జనవరి 1, 2025 నుంచి సంస్థ కొత్త సీఈవోగా రికాంత్ పిట్టి (Rikanth Pitti) నియమితులయ్యారు. అయితే, వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా నిశాంత్ ప్రకటించారు. ఇటీవలే కంపెనీలో 1.4 శాతం వాటా అంటే ప్రస్తుత మార్కెట్ వాల్యు ప్రకారం.. రూ.78 కోట్లను ఉపసంహరించుకున్న ఆయన తాజాగా ఆ కంపెనీ సీఈవో (CEO) పదవికి కూడా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.