Gas Cylinder Price: వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..!
ఆయిల్ కంపెనీలు(Oil Companys) ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ధరలను సవరిస్తాయన్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ఆయిల్ కంపెనీలు(Oil Companys) ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ధరలను సవరిస్తాయన్న విషయం తెలిసిందే. కాగా కొత్త ఏడాది(New Year) సందర్భంగా చమురు సంస్థలు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. ఈ నెల వాణిజ్య గ్యాస్ సిలిండర్(Commercial gas cylinder) ధరలను స్వల్పంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను జనవరి 1 నుంచి రూ. 14.50 వరకు తగ్గించాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు కాస్త తగ్గాయి. ఢిల్లీ(Delhi)లో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1818.50 నుంచి రూ. 1804కు చేరింది. తగ్గిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా గత డిసెంబర్ ప్రారంభంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 16.50 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మరోవైపు గృహ అవసరాలకు యూజ్ చేసే 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్(Cooking Gas Cylinder) ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఆగస్టు నుంచి వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి.