మాకేంటీ కర్మ.. మా భూమిలో ‘రాఖీ’లు కట్టించుకోవాల్సిన దుస్థితి తెచ్చారు
దిశ, జగిత్యాల : ప్రభుత్వ అధికారుల తీరు వల్ల మా భూమికే తాము రక్షణగా ఉండే పరిస్థితులు వచ్చాయని, రక్షాబంధన్ కూడా అదే భూమిలో చేసుకునే దుస్థితి ఎదురైందని బుగ్గారం గ్రామ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని బుగ్గారం గ్రామ శివారులో గల 516 సర్వే నెంబర్‌లో నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మళ్ళీ ప్రభుత్వమే లాక్కునే పరిస్థితి వచ్చిందని.. దీంతో ఆ […]
దిశ, జగిత్యాల : ప్రభుత్వ అధికారుల తీరు వల్ల మా భూమికే తాము రక్షణగా ఉండే పరిస్థితులు వచ్చాయని, రక్షాబంధన్ కూడా అదే భూమిలో చేసుకునే దుస్థితి ఎదురైందని బుగ్గారం గ్రామ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని బుగ్గారం గ్రామ శివారులో గల 516 సర్వే నెంబర్‌లో నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిలకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని మళ్ళీ ప్రభుత్వమే లాక్కునే పరిస్థితి వచ్చిందని.. దీంతో ఆ భూమిని కాపాడుకునేందుకు రక్షాబంధన్ పండుగ ను ఊరి చివరన గల తమ భూమిలో చేసుకున్నామని బాధితులు చెబుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని, అందుకే అధికారులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. భూమి లాక్కునేందుకు తమపై కుట్రలు పన్నుతున్నారని, మమ్మల్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెప్పారు. తమపై విషపూరిత ఆలోచనలు చేసి భూములను లాకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ భూమి కోసం తమ కుటుంబ సభ్యులం అందరం చవడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ, ఎట్టిపరిస్థితుల్లోనూ భూమిని వదులుకునేది లేదన్నారు. ఈ ఒక్క ఘటనతోనైనా ప్రభుత్వ అధికారులకు కనువిప్పు కలగి తమకు న్యాయం జరిగేలా చూడాలని బుగ్గారం భూ బాధితులు కోరుతున్నారు.