ట్రెండ్ సెట్ చేసిన ‘పెళ్లి కూతురు’.. ఫుల్లు ఖుషీలో ‘బుల్లెట్ బండి’ రైటర్..!
దిశ, షాద్ నగర్: పెళ్ళైన తర్వాత మెట్టినింటికి వెళుతున్న సమయంలో కన్నవాళ్లను వదిలి వెళుతున్న బాధలో నవవధువు కంటతడి పెట్టడం మాములే. కానీ, అందుకు భిన్నంగా మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నవ వధువు సాయిశ్రీయ చేసిన పని ఓవర్ నైట్‌లోనే ఆమెకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. అప్పగింతల సమయంలో బుల్లెట్ బండి సాంగ్‌కు తనదైన స్టెప్పులతో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. తన భర్తను సర్ ప్రైజ్ చేద్దామని ఆమె సరదాగా […]
దిశ, షాద్ నగర్: పెళ్ళైన తర్వాత మెట్టినింటికి వెళుతున్న సమయంలో కన్నవాళ్లను వదిలి వెళుతున్న బాధలో నవవధువు కంటతడి పెట్టడం మాములే. కానీ, అందుకు భిన్నంగా మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నవ వధువు సాయిశ్రీయ చేసిన పని ఓవర్ నైట్‌లోనే ఆమెకు స్టార్ డమ్ తీసుకొచ్చింది. అప్పగింతల సమయంలో బుల్లెట్ బండి సాంగ్‌కు తనదైన స్టెప్పులతో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది. తన భర్తను సర్ ప్రైజ్ చేద్దామని ఆమె సరదాగా చేసిన డ్యాన్స్‌కు 3 కోట్లకు పైగా వ్యూస్ లభించడం విశేషం.
4 నెలల క్రితం రిలీజైన బుల్లెట్ బండి పాటకు ఇన్ని రోజులుగా రాని పేరు సాయిశ్రీయ పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్‌తో వచ్చింది. దీంతో ఇప్పుడు ఈ పాట రాసిన షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం నిర్దవెళ్లికి చెందిన రైటర్ లక్ష్మణ్ పేరు కూడా మారుమోగుతోంది. దీంతో ఆ ఊరి గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ‘నువ్వంటే పిచ్చి’ పాటతో గుర్తింపు తెచ్చుకున్న గ్రామానికి చెందిన కవలలు రామ్ లక్ష్మణ్‌లు మళ్ళీ సాయిశ్రీయ తమ పాటకు చేసిన డాన్స్‌తో వెలుగులోకి వచ్చారు. దాదాపు 22 రోజులు కష్టపడి అమ్మాయి జీవితాన్ని ఒక పాట రూపంలో చెప్పాలన్న ప్రయత్నంతో తాను రాసిన పాట ఇంత పాపులర్ కావడం పట్ల లక్ష్మణ్ సంతోషం వ్యక్తం చేశారు.