నిరుద్యోగులకు షాకింగ్ న్యూస్.. TSPSC నోటిఫికేషన్లకు బ్రేకులు..!

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త కొలువుల భర్తీకి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. త్వరలో నోటిఫికేషన్లు అంటూ ప్రభుత్వం ఊరిస్తున్నా.. భర్తీ ప్రక్రియ ముందుకు సాగేందుకు బ్రేక్‌లు సిద్ధంగా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీతో పాటుగా పోలీస్, మెడికల్ బోర్డుల నుంచి నోటిఫికేషన్ల జారీ అయినా.. సెంటర్​ఫర్​గుడ్​గవర్నెన్స్‌లో మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే సెంటర్ ఫర్ గుడ్​గవర్నెన్స్‌లో ఉద్యోగుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన కీలక అంశాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. […]

Update: 2021-11-20 18:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త కొలువుల భర్తీకి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. త్వరలో నోటిఫికేషన్లు అంటూ ప్రభుత్వం ఊరిస్తున్నా.. భర్తీ ప్రక్రియ ముందుకు సాగేందుకు బ్రేక్‌లు సిద్ధంగా ఉన్నాయి. టీఎస్‌పీఎస్సీతో పాటుగా పోలీస్, మెడికల్ బోర్డుల నుంచి నోటిఫికేషన్ల జారీ అయినా.. సెంటర్​ఫర్​గుడ్​గవర్నెన్స్‌లో మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే సెంటర్ ఫర్ గుడ్​గవర్నెన్స్‌లో ఉద్యోగుల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన కీలక అంశాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటికి తోడుగా రోజువారీ నిర్వహణ, ప్రతినెలా డేటా అప్‌డేట్​వంటి పనుల్లోనే సీజీజీ సతమతమవుతోంది. దీనికి తోడుగా సీనియర్​ఉద్యోగులు సంస్థను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పోస్టులకైనా నోటిఫికేషన్ వస్తే వాటిని భర్తీ చేయడం మాత్రం నెలల తరబడి ఆలస్యం అయ్యే పరిస్థితి నెలకొంది.

సీజీజీ కీలకం..

ప్రభుత్వపరమైన చాలా అంశాల్లో సీజీజీ కీలకంగా పని చేస్తోంది. ఇప్పుడు మొత్తం ఆన్‌లైన్​ వ్యవస్థను కార్యాలయాల్లో అమలు చేస్తుండటంతో వాటిని నిరంతరం పర్యవేక్షించడం ప్రధానంగా మారింది. అంతేకాకుండా పలుమార్లు హ్యాకర్లు పంజా విసరడం కూడా సీజీజీ ముందు పెను​సవాల్‌గా మారింది. గతంలో హెచ్‌‌ఎండీఏ వెబ్​సైట్లను హ్యాక్ చేసినప్పుడు కీలకమైన ఫైళ్లు పెండింగ్​పడ్డాయి. డేటా రికవరీకి నాలుగైదు నెలల సమయం తీసుకున్నారు. అయినప్పటికీ 80 శాతం ఫైళ్లు తుడిచిపెట్టుకుపోయాయి. అటువైపు ధరణి సాంకేతిక సమస్యలు కూడా నిరంతరం వస్తూనే ఉన్నాయి. రవాణా, రెవెన్యూ, రిజిస్ట్రేషన్​, జీఎస్టీ వంటి అంశాలతోనే సీజీజీ తలమునకలై ఉంటోంది.

ఉద్యోగులు లేరు.. ఇప్పుడెలా..?

మరోవైపు సెంటర్​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్‌లో ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సీజీజీలో కేవలం ఉద్యోగ భద్రత ఒక్కటే ఉండగా.. వేతనాల విషయంలో చాలా వ్యత్యాసం ఉంటోంది. సాఫ్ట్​వేర్​డెవలపర్స్‌కు సీజీజీ ఏటా రూ. 8 నుంచి రూ. 10 లక్షల వేతనం ఇస్తోంది. ప్రొగ్రామింగ్​మేనేజర్‌కు రూ. 10 నుంచి రూ. 14 లక్షల ప్యాకేజీ ఉండగా.. ఇక కిందిస్థాయిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 25 వేల చొప్పున వేతనాలిస్తున్నారు. అయితే అదే సాఫ్ట్​వేర్​ డెవలపర్లకు ప్రైవేట్​సంస్థలు రూ. 16 నుంచి రూ. 20 లక్షల వరకు చెల్లిస్తున్నారు. అందులోనూ సెంటర్​ఫర్​గుడ్ గవర్నెన్స్‌లో పని చేసిన అనుభవం ఉన్న వాళ్లను హాట్​కేకులా తీసుకుంటోంది.

ప్రోగ్రామింగ్ మేనేజర్లకు కూడా అంతే..

మరోవైపు గడిచిన ఐదేండ్ల నుంచి సీజీజీలో వేతన పెంపు నామమాత్రంగానే ఉంటోంది. కానీ ప్రైవేట్ సంస్థలు రెండింతలు పెంచుతున్నాయి. దీంతో ఏండ్ల నుంచి సీజీజీలో పని చేస్తున్న వారు సంస్థను వదులుతున్నారు. ప్రస్తుతం డెవలపర్స్, ప్రోగ్రామింగ్​మేనేజర్లు దాదాపు 50 శాతం మంది వెళ్లిపోయారు. మొత్తంగా 50 శాతం ఖాళీ అయితే.. ఇప్పుడున్న సమయంలో భర్తీ చేసింది కేవలం 20 శాతం మాత్రమే. అందులోనూ వీరంతా కొత్తవారే. ఫలితంగా కొన్ని శాఖల్లో సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

ఉన్నవారిలో సగం మంది శిక్షణకే..

ఇక సీజీజీలో సీనియర్లు కొంతమంది ఉన్నా.. వారిని శిక్షణలకే ఎక్కువగా వినియోగిస్తున్నారు. సీనియర్లు ఖాళీ అవుతుండటంతో కొత్తవాళ్లను తీసుకుంటున్న సమయంలో వారికి దాదాపు ఆరు నెలలకుపైనే శిక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఫలితంగా సాంకేతికపరమైన అంశాల్లో వారు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.

దీనికితోడుగా ప్రభుత్వం ఎక్కువగా బాసర ఐఐటీ, కొండగట్టు జేఎన్‌టీయూ నుంచి రిక్రూట్ చేసుకునేది. ఒక్కో ఏడాది సగటున 60 మందిని సీజీజీకి తీసుకునేవారు. కానీ కరోనా పరిస్థితుల సాకుగా మూడేండ్ల నుంచి భర్తీ చేయడం లేదు. మూడేండ్ల తర్వాత ఈ ఏడాది బాసర ఐఐటీ, కొండగట్టు జేఎన్‌టీయూ నుంచి కేవలం 30 మందిని మాత్రమే తీసుకున్నారు. కానీ సీజీజీలో ఖాళీలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీరిని తీసుకున్నా.. ఇంకా శిక్షణలోనే కాలం వెళ్లదీస్తున్నారు.

కొలువుల భర్తీకి లేట్..

ప్రస్తుతం ప్రభుత్వ శాఖలు ఎలాగో నెట్టుకువస్తున్నా కొత్త కొలువుల భర్తీపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా శాఖల్లో ఖాళీల వివరాలను తేల్చలేదు. దీన్ని అత్యవసరంగా తేల్చినా.. కనీసం 15 రోజులకుపైనే పడుతోంది. ఈ జాబితా సిద్ధం చేసి, శాఖల వారీగా డైరెక్ట్​ రిక్రూట్‌మెంట్‌ను టీఎస్‌పీఎస్సీకి అప్పగించినా మొత్తం ప్రక్రియ సెంటర్ ఫర్ గుడ్​గవర్నెన్స్‌కు చేరాల్సిందే. దరఖాస్తుల స్వీకరణ నుంచి హాల్​టికెట్ల డౌన్​లోడ్​ వరకు అంతా సీజీజీ నిర్వహిస్తోంది. కానీ సీజీజీలో ఇప్పుడు సీనియర్లతో పాటుగా సరిపడా సిబ్బంది కూడా లేరు. వారిని ఇప్పుడు ఉన్నఫలంగా భర్తీ చేసినా వారికి శిక్షణ ఇచ్చేందుకు మరో ఆరు నెలలు ఆగాల్సిందే. దీంతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసినా.. సీజీజీ నుంచి అనుకున్నంత త్వరగా ఆమోదం వచ్చే అవకాశాలు లేవు. ఈ పరిస్థితుల్లో భర్తీ ప్రక్రియ మళ్లీ వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలో నోటిఫికేషన్లు అంటూ ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలతో ఆశ పడుతున్న నిరుద్యోగులకు ఇది నిరాశ కల్గించే అంశమే.

సర్కార్​కు ‘ఇన్​సర్వీస్’​ సెగ.. గ్రామీణ వైద్యులకు కొత్త చిక్కులు..

Tags:    

Similar News