రాయలసీమ ఎత్తిపోతలకు బ్రేక్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఘాటుగానే స్పందించింది. ఆ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆరు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ వ్వాలని, వాటిని పరిశీలించిన తర్వాత పర్యావరణ అనుమతులను జారీచేసే ప్రక్రియను పునఃప్రారంభిస్తామని, అప్పటివరకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఘాటుగానే స్పందించింది. ఆ ప్రాజెక్టుకు ఇవ్వాల్సిన అనుమతుల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదుకు కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఆరు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ వ్వాలని, వాటిని పరిశీలించిన తర్వాత పర్యావరణ అనుమతులను జారీచేసే ప్రక్రియను పునఃప్రారంభిస్తామని, అప్పటివరకు వాయిదా వేస్తున్నట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ స్పష్టత ఇచ్చింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ గతంలో లేవనెత్తిన అభ్యంతరాలకు వివరణ ఇవ్వాలని, ప్రాజెక్టు డ్రాయింగ్స్, లే అవుట్లు, చార్టుల వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు ద్వారా ఎంత నీరు వాడుకుంటున్నది కూడా స్పష్టం చేయాలని ఏపీకి స్పష్టం చేసింది. గతంలో తెలుగుగంగకు ఇచ్చిన అనుమతులలో ఏపీ ప్రభుత్వం పలు సవరణలు కోరగా వాటికి సంబంధించి సమర్పించిన దరఖాస్తులో స్పష్టత లేదని పేర్కొన్నది. ప్రాజెక్టు సవరణల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టత లేనందువల్లనే గందరగోళం నెలకొన్నదని వ్యాఖ్యానించింది.
మొత్తం 24 పేజీలతో కూడిన లేఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ శాఖ పంపింది. ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాతే పర్యావరణ అనుమతుల ప్రక్రియ ముందుకు సాగుతుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. విశ్వవిద్యాలయం ఆదేశాలు ప్రకారమే పరిశోధనా స్థానం పరిరక్షణకు కోర్టులో అఫడవిట్ వేసిన నంద్యాల పరిశోధనా స్థానం ఏ డి ఆర్ ను డిమోట్ చేసి, ఆంధ్రప్రదేశ్ చివర విజయనగరం జిల్లాలో ఒక చిన్న కొండ ప్రాంతాలలోని కేంద్రానికి బదిలీ చేయడం అన్యాయం,అవాంచనీయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిరక్షణకు తిలోదకాలు ఇచ్చి, రాజకీయ ఒత్తిళ్లుకు తలొగ్గి, ఏ డి ఆర్ ను బలి పశువును చేయడాన్ని నిరసిస్తూ రైతులు,ప్రజా సంఘాలు, కూలీలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని పరిశోధనా స్థానం వద్ద చేపట్టారు. ఇప్పటికైన విశ్వవిద్యాలయం స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని తమ ఆదేశాలు ప్రకారమే పని చేసిన ఏ డి ఆర్ బదిలీ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి, ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, తమ అంతఃకరణ శుద్ధితో, తాము ముందుగా అనేక సందర్భాలలో నంద్యాల పరిశోధనా స్థానం భూముల పరిరక్షణకు తీసుకున్న నిర్ణయానికి కట్టబడాలని సాగు నీటి సాధన సమితి, ప్రజా సంఘాలు డిమాండ్ చేసాయి.