గణేశ్ శోభాయాత్రలో అపశృతి.. విలవిలలాడిన బాలుడు

దిశ, సారంగపూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం కౌట్ల బి మరట్వాడ కాలనీలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బోర్కడ్ నగేష్ అనే బాలుడు తండ్రి నాగరావు నిమజ్జన శోభాయాత్రలో ట్రాక్టర్ పై నిల్చొని ఉన్నారు. సౌండ్ బాక్సుల కోసం అమర్చిన విద్యుత్ వైరును కరెంట్ తీగలకు తగలించడంతో ట్రాక్టర్‌కు పవర్ సరఫరా అయ్యింది. దీంతో బాలుడికి […]

Update: 2021-09-24 06:58 GMT

దిశ, సారంగపూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సారంగపూర్ మండలం కౌట్ల బి మరట్వాడ కాలనీలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి బాలుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..

బోర్కడ్ నగేష్ అనే బాలుడు తండ్రి నాగరావు నిమజ్జన శోభాయాత్రలో ట్రాక్టర్ పై నిల్చొని ఉన్నారు. సౌండ్ బాక్సుల కోసం అమర్చిన విద్యుత్ వైరును కరెంట్ తీగలకు తగలించడంతో ట్రాక్టర్‌కు పవర్ సరఫరా అయ్యింది. దీంతో బాలుడికి విద్యుత్ షాక్ తగలడంతో ప్రమాదానికి లోనయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. పండుగ పూట విషాదం జరగడంతో గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags:    

Similar News