పోతిరెడ్డి పాడుపై గళమెత్తిందే మేము..మీరు మమ్మల్నిప్రశ్నిస్తారా
దిశ, కరీంనగర్ : కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పోతిరెడ్డి పాడుపై జరుగుతున్న అన్యాయం గురించి మొదట గళమెత్తిందే టీఆర్‌ఎస్ పార్టీ అని, అలాంటిది ప్రస్తుతం బీజేపీ, హస్తం పార్టీలు మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగాయా అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఎన్ని టీఎంసీల నీరు పోతుందనే విషయంపై పార్లమెంటులో అంశాన్ని […]
దిశ, కరీంనగర్ :
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పోతిరెడ్డి పాడుపై జరుగుతున్న అన్యాయం గురించి మొదట గళమెత్తిందే టీఆర్‌ఎస్ పార్టీ అని, అలాంటిది ప్రస్తుతం బీజేపీ, హస్తం పార్టీలు మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి ఎదిగాయా అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ఘాటుగా విమర్శించారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఎన్ని టీఎంసీల నీరు పోతుందనే విషయంపై పార్లమెంటులో అంశాన్ని లేవనెత్తడమే కాకుండా, కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు చేసింది కూడా గులాబీ పార్టీయేనని గుర్తుచేశారు.పోతిరెడ్డి పాడుపై ఇప్పుడు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు, వారంతా కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నవాళ్లేనని మండిపడ్డారు.
వైఎస్ హయాంలో తవ్వినప్పుడు మాట్లాడని కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ రైతులను కాపాడాలన్న సంకల్పంతోనే టీఆర్ఎస్ ముందుకు సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం చొప్పదండి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో వినోద వెంట చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావులు ఉన్నారు.