కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. గత పది రోజులుగా వరుస లాభాలను చూసిన మార్కెట్లు గురువారం అనూహ్యంగా భారీగా కుప్పకూలింది. ఉదయం ప్రారంభం సమయంలోనే ఒడిదుడుకులకు లోనైన సూచీలు రోజంతా అదే ధోరణితో కొనసాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనమవడం, మదుపలు భారీగా అమ్మకాలకు సిద్ధమవడంతో మార్కెట్లు డీలాపడ్డాయి. అక్టోబర్ నెలలో మొదటి సెషన్ నష్టాలను నమోదు చేశాయి. ఒక్క మెటల్ రంగం తప్ప అన్ని రంగాలు నష్టాలను […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి. గత పది రోజులుగా వరుస లాభాలను చూసిన మార్కెట్లు గురువారం అనూహ్యంగా భారీగా కుప్పకూలింది. ఉదయం ప్రారంభం సమయంలోనే ఒడిదుడుకులకు లోనైన సూచీలు రోజంతా అదే ధోరణితో కొనసాగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనమవడం, మదుపలు భారీగా అమ్మకాలకు సిద్ధమవడంతో మార్కెట్లు డీలాపడ్డాయి. అక్టోబర్ నెలలో మొదటి సెషన్ నష్టాలను నమోదు చేశాయి. ఒక్క మెటల్ రంగం తప్ప అన్ని రంగాలు నష్టాలను నమోదు చేశాయి.
ప్రధానంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో అమెరికా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు రెండో ఉద్దీపణ ప్యాకేజీ లేదనే సంకేతాలు రావడంతో అమెరికా మార్కెట్లు కుప్పలాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపింది. అలాగే, యూరప్ దేశాల్లో కరోనాను నిలువరించేందుకు కఠినమైన ఆంక్షలు ఉండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగాయి. ఈ పరిణామాలతో దేశీయంగా బ్యాంకింగ్, ఐటీ రంగాలు వరుస లాభాల తర్వాత లాభాల స్వీకరణకు సిద్ధమయ్యారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1066.33 పాయింట్లు కోల్పోయి 39,728 వద్ద ముగియగా, నిఫ్టీ 290.70 పాయింట్లు నష్టపోయి 11,680 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్ మాత్రమే లాభాలను నమోదు చేయగా, మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ప్రధానంగా బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఅ, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెర్కా డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.32 వద్ద ఉంది.