ఖమ్మంలో బ్లాక్ ఫంగస్ టెన్షన్
దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. అయితే ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా నేరడ గ్రామానికి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న భద్రయ్య కంటికి ఇన్ ఫెక్షన్ రావడంతో చికిత్స కోసం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో భద్రయ్యకు బ్లాక్ […]
దిశ, వెబ్ డెస్క్ : రోజురోజుకు బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బాధితులు చేరారు. అయితే ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టిస్తుంది. తాజాగా నేరడ గ్రామానికి చెందిన వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న భద్రయ్య కంటికి ఇన్ ఫెక్షన్ రావడంతో చికిత్స కోసం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. దీంతో భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యలు గుర్తించారు. వెంటనే ఆయనను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు రిఫర్ చేశారు.