రామయ్య హుండీ ఆదాయం రూ. 1,71,20,321
భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సోమవారం హుండీలను లెక్కించారు.
దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో సోమవారం హుండీలను లెక్కించారు. హుండీల ద్వారా రూ. 1,71,20,321 నగదు లభ్యం కాగా, 92 గ్రాములు బంగారం, ఒక కేజీ 485 గ్రాముల వెండి వచ్చింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ 923 యూఎస్ఏ డాలర్స్, 165 ఆస్ట్రేలియా డాలర్స్, 12 సింగపూర్ డాలర్స్, 20 కెనడా డాలర్స్, 5 ఇంగ్లాండ్ పౌండ్స్, 10 యూరప్ యూరోస్, 20 మలేషియా రింగిట్స్, 20 థాయిలాండ్ బాట్స్ లభించినట్లు అధికారులు పేర్కొన్నారు.