Minister Tummala: మీరంతా నన్ను కుటుంబసభ్యుడిగా ఆదరించారు.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
ఖమ్మం జిల్లా ప్రజలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) భావోగ్వేగ వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా ప్రజలపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Tummala Nageswara Rao) భావోగ్వేగ వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడారు. ఖమ్మం(Khammam) ప్రజలు తనను కుటుంబసభ్యుడిగా ఆదరించారని అన్నారు. ఏ ప్రభుత్వంలో ఉన్నా జిల్లా అభివృద్ధికి కృషి చేశానని అన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టుకు స్థలం ఎంపిక జరుగుతోందని కీలక ప్రకటన చేశారు. గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు అందించడమే తన లక్ష్యమన్నారు. శాశ్వత వరద ముంపు నివారణకు రూ.700 కోట్లతో మున్నేరు రిటైనింగ్ వాల్(Munneru Retaining Walls) నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. భద్రాచలానికి రైల్వే లైన్(Bhadrachalam Railway Line) కోసం కేంద్రంతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వైద్య, విద్యా రంగంలో మోడల్‌గా నిర్మాణం చేస్తామని అన్నారు. ఖమ్మం నగర వాసులకు పర్యాటక ఆహ్లాదం కోసం వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 500 ఎకరాల్లో ఉన్న వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఏకో పార్క్‌లా అభివృద్ధి చేస్తామని అన్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఖమ్మం ఖిల్లా(Khammam Fort)పై రోప్ వే ఏర్పాటు చేస్తామన్నారు. లకారం ట్యాంక్ బండ్ వద్ద శిల్పారామం ఏర్పాటు ప్రతిపాదన ఉందని చెప్పారు.