పిట్ట కథలతో పబ్బం గడపడమే కేసీఆర్‌కు తెలుసు !
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు బాగుపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం రైతుల సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పంచన కేసీఆర్ చేరిపోయారని, తన స్వార్థ రాజకీయాల కోసమే వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, గత ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎందుకు నోరు విప్పలేదని […]
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులు బాగుపడటం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం రైతుల సంక్షేమం కోసమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పంచన కేసీఆర్ చేరిపోయారని, తన స్వార్థ రాజకీయాల కోసమే వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని, గత ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే.. ఎందుకు నోరు విప్పలేదని ప్రశ్నించారు.
గత ప్రభుత్వాలు అమలు పరిచిన అసంబద్ధ వ్యవసాయ విధానాలతోనే రైతులు కష్టాలపాలయ్యారని సంజయ్ కుమార్ విమర్శించారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే రైతులకు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న వచ్చిందని తెలిపారు. వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు చెప్పకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్..కళ్లుండి చూడలేని కబోది అని, పిట్ట కథలు చెప్పి పబ్బం గడపడమే ఆయనకు తెలుసునని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ. 6,850 కోట్లతో వ్యవసాయ ఉత్పత్తుల కల్పనకు కేంద్రం ఖర్చు చేయబోతుందన్నారు.