హుజురాబాద్‌లో బీజేపీ భారీ బహిరంగ సభ.. అమిత్ షా హాజరు.!

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. బీజేపీలో చేరిన తర్వాత అమిత్ షాను తొలిసారిగా ఈటల రాజేందర్ కలిశారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నిక గురించి ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే కేంద్రమంత్రి అమిత్ షాను కలవాలని […]

Update: 2021-07-14 07:12 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించారు. బీజేపీలో చేరిన తర్వాత అమిత్ షాను తొలిసారిగా ఈటల రాజేందర్ కలిశారు. ఈ క్రమంలో హుజురాబాద్ ఎన్నిక గురించి ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం.

ఈ భేటీ అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన రోజే కేంద్రమంత్రి అమిత్ షాను కలవాలని అనుకున్నామని అన్నారు. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈరోజు కలిసినట్టు తెలిపారు. హుజురాబాద్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్దంగానే ఉంది.. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీదే గెలుపు అని సర్వే నివేదికలు వచ్చాయన్నారు. త్వరలోనే హుజురాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉంటుందని.. సభకు అమిత్ షాను ఆహ్వానించినట్లు తెలిపారు. అయితే, సభకు ఆయన వస్తానని హామీ ఇచ్చారని అన్నారు.

అలాగే పాదయాత్రకు కూడా అమిత్ షాను ఆహ్వానించినట్టు వెల్లడించారు. ఆగస్టు 9న తన పాదయాత్ర మొదలవుతుందన్నారు. తెలంగాణలో అవినీతి, అక్రమాల, అరాచక పాలనను అంతం చేయడం కోసమే పాదయాత్ర చేపడుతున్నానని తెలిపారు.

Tags:    

Similar News