కాళేశ్వరం చుట్టే కమలనాథుల రాజకీయం
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే బీజేపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఈ ప్రాజెక్టును వేదికగా చేసుకుని బీజేపీ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు ఈ ప్రాజెక్టు అంశాన్నే ప్రధానం అస్త్రం చేసుకుని పావులు కదుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ, మూడో టీఎంసీ నిర్మాణానికి కేంద్రం అనుమతి లేదని తేలింది. దీంతో […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టే బీజేపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఈ ప్రాజెక్టును వేదికగా చేసుకుని బీజేపీ ముందుకు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు ఈ ప్రాజెక్టు అంశాన్నే ప్రధానం అస్త్రం చేసుకుని పావులు కదుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ, మూడో టీఎంసీ నిర్మాణానికి కేంద్రం అనుమతి లేదని తేలింది.
దీంతో అవినీతి, అక్రమాల కోసమే మూడో టీఎంసీ పనులు చేపట్టారంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. మరోవైపు మహారాష్ట్ర గడ్జిరోలి జిల్లా బీజేపీ నాయకులు సైతం కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ఆందోళనకు శ్రీకారం చుట్టడం గమనార్హం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద రైతులతో కలిసి బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. బ్యారేజ్ మీదుగా గత నాలుగు నెలలుగా రాకపోకలకు అనుమతించడం లేదంటూ వారు ఆరోపించారు. బ్యారేజ్ బ్యాక్ వాటర్ కారణంగా పంటలన్నీ మునకకు గురవుతున్నాయని, దానికి సంబంధించి పరిహారం అందించడం లేదని బీజేపీ గడ్చిరోలీ జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్ కోరెట్ ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్ మీదుగా రవాణాను అనుమతించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర రైతులను భూపాలపల్లి జిల్లాకు చెందిన అధికారులు సముదాయించినా.. వారు మాత్రం ససేమిరా అంటున్నారు.