బ్రేకింగ్ న్యూస్.. రైతులకు భారీ షాక్!
దిశ, పరకాల: దేవాదుల ప్రాజెక్టు అధికారులు, చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు భారీ షాకింగ్ న్యూస్ తెలుపనున్నట్లు పలు సంకేతాలు వెలువడుతున్నాయి. యాసంగి సీజన్ లో వరి పంటకు సాగునీరు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఆరుతడి పంటలకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దేవాదుల ప్రాజెక్టు అధికారుల నుండి ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే యాసంగిలో పండించే వడ్లు కొనుగోలు చేయమని […]
దిశ, పరకాల: దేవాదుల ప్రాజెక్టు అధికారులు, చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు భారీ షాకింగ్ న్యూస్ తెలుపనున్నట్లు పలు సంకేతాలు వెలువడుతున్నాయి. యాసంగి సీజన్ లో వరి పంటకు సాగునీరు ఇచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఆరుతడి పంటలకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దేవాదుల ప్రాజెక్టు అధికారుల నుండి ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే యాసంగిలో పండించే వడ్లు కొనుగోలు చేయమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు తైబంది ఆరుతడి పంటలకు పరిమితం చేసినట్లు సమాచారం. అదే కనుక నిజమైతే సుమారు మూడు మండలాల్లో రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపినట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ప్రాంతం ఆరుతడి పంటలకు అనువేనా..?
చలివాగు ప్రాజెక్టు ద్వారా వరి పంటకు సాగునీరు ఇవ్వలేకపోతే ఈ ప్రాంతం భూములు ఆరుతడి పంటలకు ఏ మేరకు అనువైనవి..? రైతులు ఇప్పటికిప్పుడు ఆరుతడి పంటలకు మొగ్గుచూపనున్నారా..? వరి పంటకు అనుకూలంగా చిన్న చిన్న కమతాలుగా మలచబడిన పంట పొలాల్లో ఆరుతడి పంటలు ఎలా పండించాలి..? తిరిగి వాటిని వర్షాకాలంలో వరి పంటకు అనుకూలంగా మార్చాలంటే వచ్చే ఖర్చు ఎంత..? అనే భిన్నాప్రాయాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంత భూములు చౌడు నేలలు. వరికి బదులు ఏ పంట వేసినా దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు ఒకవేళ ఉన్నా ఇప్పటికిప్పుడు భూకమతాలు ఆరుతడి పంటలకు అనుకూలంగా మారిన పరిస్థితులు భారీ ఖర్చుతో కూడుకొని ఉంటుంది. తిరిగి వర్షాకాలంలో వరి పంట తప్ప ఏ పంట పండించే లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులపై అంచనాలు లేకుండా అధికారులు, ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని రైతులు అనుసరించడం ఎంతవరకు సబబు అనేది కాదనలేని సత్యం. ఏం జరుగుతుందో అధికారుల నుండి స్పష్టత వెలువడే దాకా ఎదురు చూడాల్సిందే.