గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తుల అరెస్ట్

కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణా విక్రయాలపై మరోసారి ఉక్కు పాదం మోపారు.

Update: 2024-11-26 14:41 GMT

దిశ, కాటారం : కాటారం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు గంజాయి రవాణా విక్రయాలపై మరోసారి ఉక్కు పాదం మోపారు. చాలా రోజుల తర్వాత నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తులను కాటారం సిఐ, కొయ్యూరు ఎస్సై ఆధ్వర్యంలో ఏడుగురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేశారు. కాటారం పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం… కొండంపేట, కొయ్యూరు, ఇప్పలపల్లే గ్రామాలకు చెందిన కొయ్యూరు గ్రామానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కొండం పేట గ్రామానికి చెందిన బొడ్డు సాయికుమార్ (21), ఈట హరికృష్ణ (19)అక్కల నితిన్ (22), సుంకే జయంత్(21), వేల్పుల తిరుమల(19), యాదండ్ల నవదీప్(17), నీరెడి విష్ణువర్ధన్ (18)ఏడుగురు వ్యక్తులు నిషేధిత గంజాయి విక్రయం కేసులో అరెస్టు చేసినట్లు సీఐ నాగార్జున రావు తెలిపారు.

కొండంపేట గ్రామానికి చెందిన బొడ్డు సాయిలు కొండంపేట గ్రామంలో గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులకు అందిన సమాచారం మేరకు పట్టుకున్నారు. అతనితో మరో వ్యక్తి గంజాయి విక్రయించడంలో భాగస్వామి అయినారని మరో ఐదుగురు వ్యక్తుల కు గంజాయిని విక్రయించేందుకు కొన్నంపేటకు రమ్మని సమాచారం ఇవ్వగా ఈ సమయంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని సీఐ నాగార్జున రావు వివరించారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి భూపాలపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. గంజాయిని ఎవరు విక్రయించిన రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యువత ఇతరులు గంజాయికి బానిస కాకుండా ఉండాలని నిషేధిత పదార్థాలు జోలికి వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిఐ తెలిపారు. పోలీసుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి గంజాయిని విక్రయించిన, వ్యసనానికి అలవాటుపడిన కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.


Similar News