ఉత్తమ డాక్యుమెంటరీగా "భువనగిరి దుర్గం"
నేను సైతం యూత్ సోషల్ సర్వీస్ కమిటీ సంస్థ వారు నిర్వహించిన “నేను సైతం ప్రీమియర్ అవార్డ్స్-2020” లో భాగంగా జాతీయ స్థాయి షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పై పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ భాషల్లో 215 షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ను ప్రదర్శించగా, అందులో వారసత్వ సంపదగా, అడ్వెంచర్ ప్లేస్ ఆఫ్ తెలంగాణగా గుర్తింపు పొందిన భువనగిరి ఖిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన “భువనగిరి దుర్గం” […]
నేను సైతం యూత్ సోషల్ సర్వీస్ కమిటీ సంస్థ వారు నిర్వహించిన “నేను సైతం ప్రీమియర్ అవార్డ్స్-2020” లో భాగంగా జాతీయ స్థాయి షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పై పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ భాషల్లో 215 షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ను ప్రదర్శించగా, అందులో వారసత్వ సంపదగా, అడ్వెంచర్ ప్లేస్ ఆఫ్ తెలంగాణగా గుర్తింపు పొందిన భువనగిరి ఖిల్లాపై రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన “భువనగిరి దుర్గం” ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికైంది. అంతేకాకుండా, ఈ చిత్రానికి కథ-స్క్రిప్ట్-దర్శకత్వం వహించిన బడుగు విజయ్ కుమార్‌కు సైతం ఉత్తమ దర్శకుడు అవార్డ్‌కు ఎంపికైయ్యారు. కాగా, ఈ చిత్రాన్ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈనెల 23న నిజామాబాద్‌లో నిర్వహించనున్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీ ప్రముఖుల చేతులమీదుగా ఈ ప్రతిభ పురస్కారాలతో పాటు ప్రశంస పత్రాన్ని అందించనున్నారు. అవార్డు సాధించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది.